Butchaiah Chowdhury : ఆయన వచ్చేది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే
నియోజకవర్గాల పునర్విభజనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdhury) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సీఎం (CM), డిప్యూటీ సీఎం (Deputy CM) అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏ (NDA) లో భాగస్వామ్యంగా ఉన్నందున బహిరంగంగా మాట్లాడకూడద ని చెప్పారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయని చెప్పారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదన్నారు. నిన్న మాజీ సీఎం జగన్ (Jagan) అపర గోబెల్స్‌లా మాట్లాడారు. మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని ఆయన అంటున్నారు. ఆయన వచ్చేది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే. వైసీపీ హయాంలోని లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. జగన్ హయాంలో పంటలకు బీమా కూడా చెల్లించకపోవడంతో రైతులు రూ.వేల కోట్లు నష్టపోయారు. గత ప్రభుత్వం గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందే అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నాం. మేలో తల్లికి వందనం, జూన్‌లో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం. రానున్న పుష్కరాలకు రాజమహేంద్ర వరం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నాం. రాజహేంద్రవరంలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడాను. గతంలో వైసీపీ కార్యాలయానికి రాజమహేంద్రవరంలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారు. టీడీపీ కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే మాత్రం ఇవ్వడం లేదు అని తెలిపారు.













