సీఎం చంద్రబాబును కలిసిన కపిల్‌దేవ్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్, ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చన్ని)తో కలిసి ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించారు. సమావేశం అనంతరం కపిల్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ క్రీడలపై సీఎం చాలా ఆసక్తిగా ఉన్నారు. గోల్ఫ్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఇండియన్ గోల్ఫ్‌కు అధ్యక్షుడిగా ఉన్నా. ఎక్కడ భూమి ఇస్తారనేది ప్రభుత్వానిదే నిర్ణయం. స్పోర్ట్స్ సిటీ ఇస్తే చాలా సంతోషిస్తా అని కపిల్ దేవ్ తెలిపారు.
అనంతపురం, అమరావతి, విశాఖలో గోల్ప్ కోర్సులు పెడతామని కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ అంబాసిడర్‌గా ఉండాలని కపిల్‌దేవ్‌ను కోరాం. రాష్ట్రంలో గోల్ఫ్ అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నాం. గోల్ఫ్ డ్రైవింగ్‌కు రేంజ్‌లు సిద్ధం చేస్తాం. తదుపరి సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఏపీ క్రీడాకారులు అంతర్జాతీయంగా ఆడేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ క్రీడాకారులను వెలికి తీస్తాం అని తెలిపారు.













