కేంద్రమాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరిక
పసుపు కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు. ప్రజావేదికకు పెద్దఎత్తున తరలివచ్చిన విజయనగరం ప్రజలు. అరకు పార్లమెంట్ పరిధిలోని 4జిల్లాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు. తరలివచ్చిన గిరిజనులతో ప్రజావేదిక కిటకిట. అజాత శత్రువు కిషోర్ చంద్రదేవ్ : మంత్రి సుజయ కృష్ణ రంగారావు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. జాతీయ రాజకీయాలలో కిషోర్ చంద్రదేవ్ కీలక భూమిక. గిరిజన ప్రాంతాలకు ఎంతో సేవలు అందించారు.
టిడిపితో పనిచేయడం నాకు కొత్త కాదు: కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్
నేషనల్ ఫ్రంట్ లో కలిసి పనిచేశాను. ఎన్టీఆర్ తో 10ఏళ్లు కలిసి పనిచేశాను. అభివృద్ధి కోసం చంద్రబాబు పరితపిస్తారు. హైదరాబాద్ ను అభివృద్ది చేశారు. అదే స్ఫూర్తితో ఏపి అభివృద్ధికి నడుంకట్టారు. బాక్సైట్ ఉద్యమం గుర్తు చేసిన కిషోర్ చంద్రదేవ్. నా నియోజకవర్గం కాకపోయినా వ్యతిరేకించాను. గిరిజనులకు జీవనోపాధి పోతుందని చెప్పాను. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నాను.
అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలే ఆపగలిగాను కాను లైసెన్స్ రద్దు చేయించలేక పోయాను. లైసెన్స్ లు పూర్తిగా రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే
బాక్సైట్ తవ్వకాల వెనుక నిజాలు జనానికి తెలియదు. ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే హత్య దురదృష్టకరం. బాక్సెట్ తవ్వకాల వెనుక నిజాలను ప్రజలకు వివరించాలి. సమాఖ్య రాజ్య స్ఫూర్ధికి ప్రధాని మోది తూట్లు: కిషోర్ చంద్రదేవ్
బిజెపి ఒక వర్గానికి మరో వర్గానికి తగువులు పెడుతోంది: కిషోర్ చంద్రదేవ్
ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి తగువులు. 2019లో మోదికి వంద సీట్లు కూడా రావు. ఇటువంటి హింసా రాజకీయాలు గతంలో లేవు. ఢిల్లీలో బిజెపి రాకూడదనే ఇక్కడ టిడిపిలో చేరుతున్నా. కేంద్రం తోడ్పాటు లేకున్నా రాష్ట్రంలో గొప్ప అభివృద్ది. ఎన్డీఏకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలి. ముఖ్యమంత్రిగారికి పూర్తి సహకారం ఇస్తాను. టిడిపితో కలిసి పనిచేస్తా, రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తా.
కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరిక సంతోషకరం: ముఖ్యమంత్రి చంద్రబాబు
41ఏళ్ల కిషోర్ చంద్రదేవ్ రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేదు. మచ్చలేని రాజకీయాలు చేశారు కిషోర్ చంద్రదేవ్. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావాలి. మాజీ కేంద్రమంత్రిగా కిషోర్ చంద్ర దేవ్ సేవలు ప్రశంసనీయం. 5సార్లు లోక్ సభకు, ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం. ఎన్నో పదవులు చేసినా ఎంతో వినయం.
కిషోర్ చంద్ర దేవ్ కు, జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదు: ముఖ్యమంత్రి చంద్రబాబు
కిషోర్ చంద్ర దేవ్ హుందా రాజకీయాలు చేశారు. రాజకీయాలకు గౌరవం తెచ్చారు కిషోర్ చంద్రదేవ్. రాజకీయాలను నేరమయం చేసింది జగన్. దాడులు చేయడానికే జగన్ పార్టీ పెట్టారు. నిన్న గుంటూరులో జనసేన పై దాడి చేశారు. నెల్లూరులో కాంగ్రెస్ పై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీపై దాడి చేశారు. జర్నలిస్ట్ లపై దాడులు చేస్తున్నారు
రౌడీయిజం చేస్తే సహించేది లేదు.
బాక్సైట్ లీజులు ఇచ్చింది ఎవరు..? చంద్రబాబు సూటి ప్రశ్న
అప్పట్లో రాజశేఖర రెడ్డి ఇచ్చారు బాక్సైట్ లీజులు. టిడిపి పై బురద జల్లుతున్నారు. కిషోర్ చంద్రదేవ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. బాక్సైట్ లైసెన్స్ లు రద్దు చేసింది నేనే
ఏజెన్సీ గిరిజనులకు న్యాయం చేసింది టిడిపినే. గిరిజనుల మనోభావాలకు సంబంధించిన విషయం. గిరిజనుల హక్కులకు సంబంధించిన విషయం. ఏజెన్సీలో ఒక వ్యక్తి సృష్టించిన కల్లోలం. ఒక వ్యక్తి రాజకీయలాభాల కోసం చేసిన విధ్వంసం. చిన్నదేశంతో ఎంవోయూ చేసుకున్నారు. బాక్సైట్ తవ్వకాలకు కారకుడు రాజశేఖర రెడ్డి. దానిని అడ్డుకోవడానికి కృషి చేసింది కిషోర్ చంద్రదేవ్. వాటిని రద్దు చేసింది చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.
దేశంలో ప్రతిపక్ష నేతలపై నరేంద్ర మోది దాడులు. హైదరాబాద్ లో ఆస్తులున్న టిడిపి నేతలకు బెదిరింపులు. వైసిపి లో చేరాలని టిఆర్ ఎస్ నేతల వేధింపులు. మోది ఏవిధంగా అవినీతిపరుడికి మద్దతిస్తారు. ఆంధ్రప్రదేశ్ పై ముగ్గురు కుట్రలు చేస్తున్నారు. మూడు పార్టీల కుట్రలను ప్రజలే తిప్పికొట్టాలి.
అరకు పార్లమెంట్ పరిధిలో టిడిపి జెండా ఎగరాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు
7 అసెంబ్లీ సీట్లకు 7సీట్లు టిడిపి గెలవాలి. అన్ని ప్రాజెక్టు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించాం. ఏజెన్సీ ప్రాంతాలలో తాగునీటి పథకాలు పూర్తి
గిరిజన విద్యార్ధుల చదువులకు చేయూత. విద్యా,వైద్య వసతుల అభివృద్ధి. 153 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు. 24గంటలు వైద్య సదుపాయాలు
కొండ ప్రాంతాలలో ద్విచక్ర అంబులెన్స్ లు తెచ్చాం. గిరి ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. అనారోగ్యంతో ఏ గిరిజనుడు బాధపడ కూడదు. ఇంటింటికి దోమతెరలు పంపిణీ చేశాం. 2లక్షల మందికి ఫుడ్ బాస్కెట్ పథకం. గిరిజనులకు పోషకాహార భద్రత ఇచ్చాం. ప్రతినెలా రూ.530విలువైన పోషకాహారం. అరకు కాఫీ ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అరకు కాఫీ. రూ200 పెన్షన్ ఇచ్చినందుకే వైఎస్ 10సార్లు చెప్పారు. నేను రూ.200నుంచి రూ.2వేలకు పెంచాను
గిరిజన ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.50వేలు. గిరిజనుల ఇళ్ల నిర్మాణానికి రూ.2లక్షల 50వేలు. ఎస్టీల ఇళ్లకు గతం కన్నా రూ.లక్ష పెంచాం.
గిరిజనులకు ఎవరు మంచి చేశారు..? ముఖ్యమంత్రి చంద్రబాబు సూటి ప్రశ్న
ఏజెన్సీ ప్రాంతాలలో చర్చ జరగాలి
గిరిజనులు ఎప్పటికైనా టిడిపితోనే ఉంటారు
మీ ఆరోగ్యం, మీ బిడ్డల విద్య, మీకు పెన్షన్లు
పెద్దఎత్తున సంక్షేమ పథకాలు తెచ్చాం
ఇవన్నీ కొనసాగాలంటే తెలుగుదేశం మళ్లీ రావాలి
తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ ఉంటాయి
జగన్ కాబోయే సీఎం అని కెటిఆర్ అంటారు
కుట్ర రాజకీయాలకు కెటిఆర్ వ్యాఖ్యలే రుజువు
ఏపి అభివృద్ది కావడం ముగ్గురికి ఇష్టం లేదు
మూడు పార్టీలు ఏపి పై విషం కక్కుతున్నాయి
శక్తిఉంటే నాతో అభివృద్ధిలో పోటిబడండి
మీ కుట్రలకు ప్రజలే బుద్ది చెబుతారు
గ్రాఫిక్ లు అని మీరు అనుకుంటూ ఉండండి
మీరన్న గ్రాఫిక్ లే రేపటి నిజాలు
రాజధానిలో రూ.50వేల కోట్లతో పనులు
ఏపిలో అభివృద్ది చూసి లబోదిబో అంటున్నారు
నేను ఉంటే వీళ్ల ఆటలు సాగవు
అందుకే నాకు వ్యతిరేకంగా కుట్రలు
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం.
రాజధాని నిర్మాణం అద్భుతంగా పూర్తిచేస్తాం
40ఏళ్ల రాజకీయ జీవితంలో నాపై కులముద్ర లేదు
కులముద్ర వేయడానికి ఎవరూ సాహసించలేదు
చాలామంది నాయకులతో పోరాడాను
ఎవరూ అలాంటి తప్పుడు పని చేయలేదు
కులముద్ర వేయడం ద్వారా ప్రజలకు దూరం చేసే కుట్ర
బీహార్ కన్సల్టెంట్ ను పెట్టుకుని బీహారీ రాజకీయం
బీహార్ లో,ఉత్తరప్రదేశ్ లో ఇలాగే చిచ్చు
ఇప్పుడు అవే కుట్రలు ఏపిలో తెస్తున్నారు
కుల రాజకీయాలు చేస్తున్నారు
ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగవు
జగన్మోహన్ రెడ్డి కుప్పిగంతులు నా ముందు చెల్లవు
ఒకవైపు నరేంద్ర మోది ఈడి,ఐటి దాడులు
మరోవైపు కెసిఆర్ బెదిరింపులు,వేధింపులు
ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి కుట్రలు,కుతంత్రాలు
అందరి టార్గెట్ తెలుగుదేశం పార్టీయే
ఆంధ్రప్రదేశ్ నే 3 పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి
నా స్వార్ధం కోసం నేను పోరాడటంలేదు
రాష్ట్రం కోసం పోరాడుతున్నాను,
భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నా
గత 5ఏళ్లుగా మీ కోసం నేను కష్టపడ్డా
పునాదుల నుంచి రాష్ట్రాన్ని నిర్మిస్తున్నాను
ఇప్పుడు మీరంతా రోడ్లపైకి రావాలి
ఇంటికో కార్యకర్త బైటకు రావాలి
కుటుంబానికో నాయకుడు తయారవ్వాలి
కుట్రల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
పేదల సంక్షేమం ఇకపై కూడా కొనసాగాలి
ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావాలి
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. పరిశ్రమలు నెలకొల్పాలి
మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి
మన ఆడబిడ్డలు బైటకెళ్లి క్షేమంగా రావాలి
తెలుగుదేశం మళ్లీ వస్తేనే ఇవన్నీ సాధ్యం
నరేంద్రమోది మళ్లీ వస్తే అధోగతే.
బిజెపి గెలిస్తే ప్రజాస్వామ్యం బతకదు.













