Liquor Scam: ఆ ఇద్దరినీ అరెస్ట్ చేయనున్న ఈడీ..?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించి, పరిణామాలు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. అటు పోలీసు వర్గాలు కూడా ఈ అంశంపై ఏం జరగబోతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇందులో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి మరింత ఆసక్తిని రేపుతోంది. కీలక వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఈ వ్యవహారాన్ని సిబిఐ చేతిలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) నిర్ణయం తీసుకున్నారని ఓ వార్త బయటకు వచ్చింది.
చంద్రబాబు ఇప్పటికే దీనిపై కీలక మంత్రులతో కూడా చర్చించారని, అసెంబ్లీ సమావేశాలు(Ap Assembly) చివరి రోజున లిక్కర్ కుంభకోణాన్ని సిబిఐ చేతుల్లో పెట్టేందుకు సిద్ధమయ్యారని, టీడీపీ అనుకూల మీడియాలో కాస్త ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు ఈ కేసులో ఈడి అధికారులు ఓ ఇద్దరినీ అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి ఈడీ అధికారులు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అదేవిధంగా ఈ కేసులో మొదట అరెస్టయిన, రాజ్ కేసిరెడ్డి కూడా ఈడి అదుపులోకి వెళ్లే అవకాశాలు ఉండొచ్చని పోలీస్ వర్గాలు అంటున్నాయి.
విదేశాల్లో ఉన్న నిందితుల్లో ఎక్కువ మంది అతని ఆదేశాల మేరకు పనిచేశారు. దీనితో.. ఆయనను అదుపులోకి తీసుకుంటే, విదేశాల్లో ఉన్న నిందితుల గురించి కూడా క్లారిటీ వస్తుందని ఈడీ భావిస్తోంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో, వాళ్లే కీలకపాత్ర పోషించినట్లుగా కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఆ సొమ్ముతో విదేశాల్లో ఆస్తులు కూడా కొన్నారని, అలాగే భారతదేశానికి కొంత సొమ్మును మళ్ళించారని కూడా గుర్తించారు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గాల్లో నగదు పంపిణీకి ఆ సొమ్మును వినియోగించినట్లు, కూడా అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పక్క ఆధారాలను ఇప్పటికే ఈడి అధికారులు సిట్ దగ్గర తీసుకున్నట్లుగా కూడా సమాచారం.