ఎన్నికల ఉల్లంఘన కింద పవన్ కు ఈడి నోటీసులు..
ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ప్రచారం ప్రారంభించిన పార్టీ నేతలు ఒకరినొకరు ప్రజల ముందే భయంకరంగా దూషించుకుంటున్నారు. ఎన్నికల సంఘం నియమావళిని కూడా కొందరు ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారికి ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అనుచితంగా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ కి కూడా ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం జరిగింది. స్కాం స్టార్ .. లాండ్ మాఫియా, ఇసుక, మద్యం సామ్రాజ్యానికి అధినేత అంటూ పవన్ జగన్ పై ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియచేస్తూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 8న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు సమర్పించారు. పవన్ వ్యాఖ్యలు నిజంగా ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆధారాలతో సహా సమర్పించిన విష్ణు ఎన్నికల సంఘాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు స్పందించిన ఈసీ 48 గంటల్లో వివరణ ఇవ్వవలసిందిగా పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. ఇటీవల అనకాపల్లిలో నిర్వహించిన సభలో పవన్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు అతనికి నోటీసులు వచ్చేలా చేశాయి.













