జగన్ అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ చేపట్టవచ్చని తెలిపింది. సీబీఐ ఛార్జిషీట్లు తేలిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలని జగన్ కోరగా.. ఆయన వాదనను సీబీఐ, ఈడీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో నేరాభియోగాలు వేర్వేరని ఈడీ సృష్టం చేసింది. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేపడతామని చెబుతూ.. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.













