వరలక్ష్మీ పై డాక్టర్ శోభారాజు పాట
పద్మశ్రీ అవార్డు” గ్రహీత డాక్టర్ శోభారాజు గారు వరలక్ష్మీదేవి పై ఒక్క గీతాన్ని రచించి స్వరపరచి తమ శిష్యులకు నేర్పారు. ఈ వరలక్ష్మీ వ్రత శుభ సందర్బంగా ఆపాట మీ అందరికీ అందిస్తున్నాము. అన్నమాచార్య భావనావాహిని విద్యార్థులు నాగ పుష్పిక స్వర్ణ పుష్పిక ఈ పాట ను పాడారు.
సాహిత్యం & సంగీతం:
“పద్మశ్రీ అవార్డు” గ్రహీత డాక్టర్ శోభారాజు
Lyrics & Music:
“Padmasree” Awardee, Dr. Shobha Raju
Song Lyric:
రావమ్మా వరలక్ష్మీ
పల్లవి
రావమ్మా వరలక్ష్మీ
కావంగమాలక్ష్మీ
గజ్జెలు ఘల్ ఘల్ ఘల్లనగా – మా
యింటను గలగల సిరులొలక||
మాయమ్మ గద రావే వరలక్ష్మీ
మా ముద్దుపట్టి రావే – మా లక్ష్మీ||
చరణం – 1
కళ కళ లాడగ మా ముంగిళ్లు
రంగవల్లులే తీర్చేము – నీ
పదములు కందునేమోయని – చే –
మంతులు, బంతులు పరచేము||
చరణం – 2
అనపాయనివని తెలుసును తల్లీ
ముందుగా హరినే పిలిచాము – నీ
స్వామి వేచెమాతో కూడా – రా
బంగారూ! పూజించేము||













