వైసీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్ఆర్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో కలిసి సీఎం జగన్ వద్దకు వెళ్లి పార్టీలో చేరారు. అనంతరం డొక్కా వరప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. 2014లోనే వైఎస్ఆర్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని, కానీ కొన్ని కారణాల రిత్యా టీడీపీలో చేరవల్సి వచ్చిందని వివరించారు. అయినా టీడీపీలో సరైన గౌరవం లభించలేదని, కాలం కలసిరాలేదని అన్నారు. ఇక డొక్కాను పార్టీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సురేష్, ఎమ్మెల్యే అంబటి ప్రకటించారు.













