చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి : సినీనటి దివ్వవాణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సినీనటి దివ్వవాణి అన్నారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమవేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడంలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు అధికారం చేపట్టినా, కాపుల రిజర్వేషన్లపై ఏనాడూ దృష్టి సారించలేదన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలో ప్రస్తావించిన మేరకు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.













