జాతీయ ప్రాజెక్టును గాలికి వదిలేసి .. జగన్ జాతి ద్రోహానికి పాల్పడ్డారు
జాతీయ ప్రాజెక్టుని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి జగన్ జాతి ద్రోహానికి పాల్పడాడరని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా దేవినేని మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డిని వెనకేసుకొస్తూ మంత్రి అంబటి రాంబాబు మీడియాపై విషం కక్కారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో మీడియాను , ప్రతిపక్షాలను ఎందుకు అనుమతించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంలో గైడ్ బండ్ ఎందుకు కుంగింది? అని ప్రశ్నించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సంగతేంటని నిలదీశారు. లైడార్ సర్వేపై మంత్రి ఎందుకు నోరుమెదపలేదని మండిపడ్డారు. సర్వేరిపోర్టులన్నీ తొక్కిపెట్టి పోలవరం నిర్వాసితుల్ని ఏం చేయాలనుకుంటున్నారు. పోలవరం కాపర్ డ్యామ్ భద్రతకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గోదావరి వరద ముంచుకొస్తున్న తరుణంలో నిర్వాసితుల్ని ఏం చేయబోతున్నారని దేవినేని నిలదీశారు.













