Pawan Kalayn: గంజాయి గ్రామదేవతకు నైవేద్యం: పవన్ ఆసక్తికర కామెంట్స్
ఉత్తారాంధ్ర పర్యటనలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిజీ బిజీగా గడుపుతున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ శంకుస్థాపన చేసారు. ఇక గిరిజన గ్రామాల్లో ఆయన పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజల జీవన పరిస్థితుల గురించి స్వయంగా ఆరా తీస్తున్నారాయన. అనంతగిరి మండలం బల్లగరువు పినకోట పంచాయతీ లో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఇక గిరిజనులతో కలిసి కాసేపు ముచ్చటించారు డిప్యూటి సిఎం. ఈ సందర్భంగా వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
గత ప్రభుత్వ పని తీరుకు ఈ ప్రభుత్వ పని తీరుకు సంబంధించి అనేక విషయాలను ఆయన గిరిజనులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను పరిష్కరించేందుకు పవన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రోడ్ల నిర్మాణం విషయంలో ఆలస్యం జరిగితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో తీవ్రమైన గంజాయి (Ganja) సమస్యపై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. గంజాయి సాగు గిరిజన ఆచారమన్న ఆయన… గంజాయిని గ్రామదేవతకు నైవేద్యంగా పెడతారన్నారు.
అందుకే ఏజెన్సీలో సాగు అవుతుందని… ఆచారంగా భావించినప్పుడు సమస్య ఉత్పన్నం కాలేదన్నారు ఆయన. గంజాయిని కమర్షియల్ గా ఎప్పుడైతే ఆలోచన చేశారో సమస్య మొదలైందని తెలిపారు. ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఒక మాఫియాల మారిందన్నారు ఆయన. పోలీసులతోనే సమస్య పరిష్కారం కాదు… స్థానిక యువ సర్పంచులు గంజాయి నిర్మూలనకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపుతే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రోడ్లు, టూరిజం అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుందని సూచించారు.













