కెడ్రాయ్ ప్రాపర్టీ షో ప్రారంభించిన నారా లోకేష్
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఐదో క్రేడాయి ప్రాపర్టీ షోను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. వివిధ నిర్మాణ సంస్థలు ఈ షోలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఉండవల్లి కన్స్ట్రక్షన్ స్టాల్‌ను సందర్శించిన మంత్రి లోకేష్.. నూతనంగా ఏర్పాటు చేస్తున్న శ్రీవల్లి ప్రవాస్ వెంచర్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నవ్యాంధ్రలో ఇలాంటి మెగా ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు నారా లోకేష్. బిల్డర్ల సమస్యలు జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ చెప్పారు. బిల్డర్ల సమస్యలపై వర్కింగ్ కమిటీ వేస్తామన్నారు. సీఆర్డీఏ పరిధిలో 10 వేల కోట్ల రూపాయలతో ఇళ్లను నిర్మించడం అభినందనీయమన్నారు. సీఎం చంద్రబాబు కృషితో పరిశ్రమలు వస్తున్నాయని లోకేష్ తెలిపారు.













