చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటీసు
ఉండవల్లిలోని ప్రజావేదికను నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా, అవినీతిగా నిర్మించారంటూ దాన్ని కూల్చివేయాలంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆ భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేయడం జరిగింది. అక్రమ కట్టడాలపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. అయితే ఆ అక్రమ కట్టడాల జాబితాలో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి బాబు నివాసానికి నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు సృష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అతిథి గృహాన్ని.. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం తన నివాసం మార్చుకుని జడ్ ప్లస్ కేటగిరి భద్రతకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసిన సంగతి తెలిసింది.













