CRDA: 13న సీఆర్డీఏ భనవం ప్రారంభం

అమరావతిలో సీఆర్డీఏ (CRDA) ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రజామోదం పొందిన డిజైన్‌లో అమరావతి (Amaravati) కి ప్రతీకగా ఏ అనే అక్షరంతో అత్యాధునిక హంగులతో భవనం సిద్ధమైంది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మధ్యలో కొన్నేళ్లు మొండిగోడలకే పరిమితమైన నిర్మాణం, నేడు అద్దాలతో తళుకులీనుతోంది. కార్పొరేట్(Corporate) తరహా హంగులతో 7 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. కార్యాలయం ఎదుట జాతీయ జెండా కోసం వంద అడుగుల పోల్‌ను ఏర్పాటు చేశారు. పరిసరాలను మొక్కలు, చెట్లతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 13వ తేదీన ప్రారంభించనున్నారు. రాజధాని (Capital) లో ప్రారంభమవుతున్న తొలి పూర్తిస్థాయి భవనం ఇదే కావడం విశేషం.