జగన్ పై వ్యతిరేకత.. ఏపీలో అధికార మార్పిడి ఖాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనూ అధికార మార్పిడి ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణలో ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసాల కంటే, రాష్ట్రంలో జగన్ చేసిన తప్పులే ఎక్కువని ఆరోపించారు. తెలుగు ప్రజానీకానికి బీజేపీ వ్యతిరేకంగా ఉందని, అయితే ఆ పార్టీకి అనుకూలంగా జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్కో ఎంపీ స్థానంలో పోటీ చేస్తామని అన్నారు.













