ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కూడా… ప్రధాని మోదీయే
400 సీట్లు వస్తాయని మోదీ ధీమాతో ఉన్నారు కానీ, ఆయనను గద్దె దించడానికి ఇండియా మొత్తం ఎదురు చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడతూ బీజేపీ పాలన అవినీతిమయంగా సాగిందని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో అక్రమాలకు బాధ్యులుగా ఈసీ ఉన్నతాధికారులను మార్చింది కానీ, కింది స్థాయిలో మొత్తం వైసీపీ సామ్రాజ్యమే ఉందని వెల్లడిరచారు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటుంటే జగన్, చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోవడం బాధ్యతా రహిత్యమని ఆరోపించారు. ఈసారి ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఈసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలనేది కూడా ప్రధాని మోదీయే నిర్ణయిస్తారని అన్నారు. జగన్ అయినా, చంద్రబాబు అయినా ఆయన దయతోనే సీఎం కావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.













