సీఎం వైఎస్ జగన్ తిరుపతి పర్యటన రద్దు
తిరుపతి ఎన్నికల ప్రచార సభ రద్దు చేసుకుంటున్నట్లు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సభకు రాలేకపోతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాశారు. నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. తిరుపతి సభకు నేను హాజరైతే వేలాదిగా జనం తరలివస్తారు. ప్రజల ఆరోగ్యం, ఆనందం నాకు ముఖ్యం. బాధ్యత కలిగిన సీఎంగా తిరుపతి సభ రద్దు చేసుకుంటున్నా అని తెలిపారు. నా సంతకంతో ఇంటింటికి అందేలా ఉత్తరం రాశా. మీ అందరి కుటుంబాల దృష్టా నేను సభకు రాకుండా ఆగిపోయినా.. మీకు చేసిన మంచి మీ అందరికి చేరిందన్న నమ్మకం నాకుంది. మీ అందరి చల్లని దీవెనలు ఓటు రూపంలో ఇస్తారని భావిస్తున్నా. డా.గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.













