ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం… 50 మందికి పైగా
ఆంధప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్నది. సచివాలయ ఉద్యోగుల్లో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ ఉద్యోగి కరోనాతో మృతి చెందారు. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేసే వి.పద్మారావు కొవిడ్ సోకి కన్నుమూశారు. దీంతో సచివాలయం ఉద్యోగుల్లో భయాందోళన నెలకొంది. కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా మరోసారి వర్క్ ఫ్రం హోం ఇవ్వాల్సిందిగా ఉద్యోగులు ప్రభుత్వాన్ని వ్ఞిప్తి చేస్తున్నారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే 50 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో సచివాయలంలో పని చేసేవారికి ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. కొవిడ్ భయంతో ఉన్నతాధికారులు విజయవాడ, గుంటూరుల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల నుంచే విధులు నిర్వహిస్తున్నారు.













