కరోనా ఎఫెక్ట్… ఒంటిమిట్ట రామాలయం మూసివేత
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఒంటిమిట్ట ఆలయాన్ని మే 15వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత కొనసాగుతోంది. ఏటా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.













