ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఇంత హడావుడి ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలకు ఎం చెబుతారని కాంగ్రెస్ నేత శైలజనాథ్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినా తాడేపల్లి ఫ్యాలస్ గడప దాటని జగన్ నేతలకు హిత బోధ చేయడం హాస్యాస్పంంగా ఉందన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేక వారు గడప దాటడానికి సాహిసంచడం లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందే ఇంత హడావుడి ఎందుకు అని ప్రశ్నించారు. మూడేళ్లయినా అభివృద్ధి జరగలేదని అందుకు ప్రజలే మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపుతారు అని జ్యోం చెప్పారు. సామాజిక న్యాయం పేరుతో మంత్రులంతా కట్ట కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేసిన విహార యాత్ర తుస్సుమందని విమర్శించారు.













