కోవిడ్–19పై ప్రజల్లో అవగాహన పెంచండి
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
కరోనా వైరస్ నివారణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్లకు సూచించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు.













