20న పోలవరానికి సీఎం జగన్
నవ్యాంధ్ర ప్రజల జీవనాడి ప్రాజెక్టు పోలవరాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఈ నెల 20న సందర్శించనునానరు. సీఎం హోదాలో తొలిసారిగా వెళ్లి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆయన పరిశీలించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి సమీక్షలో పోలవరాన్ని అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని, నిర్మాణం వేగవంతం చేయాలని జగన్ అధికారుల్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పోలవరాన్ని సందర్శించి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా పనుల్లో పురోగతిపై అధికారులతో సమీక్షించనున్నారు.













