ఆ ఘనత వైఎస్ఆర్ దే : సీఎం జగన్
ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ దేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరులో మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. మైనార్టీల సంక్షేమంలో వైఎస్ ఒక అడుగు ముందుకేస్తే ఆయన కొడుకుగా తాను రెండు అడుగులు ముందుకు వేస్తున్నానన్నారు. గతంలో మైనార్టీలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామన్నారు. ఇప్పుడు జరుగుతున్న మార్పును గమనించాలన్నారు. మైనార్టీ పిల్లలు బాగా చదవాలన్నారు. చదువు లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గలేరన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలకు రూ.2665 కోట్లు ఇస్తే ఈ మూడున్నరేళ్లలో రూ.20 వేల కోట్లు సాయం చేశామన్నారు. వక్ఫ్ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే అన్యాక్రంతమైన 580 ఎకరాలను స్వాధీనం చేసుకున్నాము. ఈ ప్రభుత్వం మీది అని మర్చిపోవద్దు అని స్పష్టం చేశారు.













