వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్నినాని ఉన్నారు. అంతకుముందు గోదావరి వరద పరిస్థితులపై ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధికారులంతా సహాయ పునరావాస కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. నేను ఏరియల్ సర్వేకు వెళ్తున్నాను. నేను వెళ్తున్నాను కాబట్టి మీరు సహాయ పునరావాస కార్యక్రమాలను వదిలిరావాల్సిన అవసరం లేదు. అందుకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నానని ఆయన అన్నారు.













