కువైట్లో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా నిర్వహించారు. కువైట్లోని మాలియా ప్రాంతంలో ఉన్న పవన్ ఆంధ్రా రెస్టారెంట్లో వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ఎం. బాలిరెడ్డి ఆద్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కువైట్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.













