పేదలకు సీఎం జగన్ అభయహస్తం
పేదలకు సహాయం చేయడంలో ఏపీ సీఎం జగన్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి ఆయన తన దాతృత్వం చాటుకున్నారు. యలమంచిలి పర్యటనలో భాగంగా అనారోగ్య బాధితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులకు అవసరమైన సహాయం అందించాలని, వారికి సహాయం అందించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించకూడదని జిల్లా కలెక్టర్ రవి పట్టన్కు ఆదేశాలు జారీ చేశారు. వారిలో వాణి అనే బాలికకు చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో పాటు చెవులు కూడా వినిపించడం లేదు. మెరుగైన చికిత్స అందించేందుకు తగిన ఆర్థిక స్థోమత లేకపోవడంతో కుటుంబీకులు చేసేది ఏమీ లేక ఆశలు వదులుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వారికి తన పూర్తి సహకారం అందిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఎంత ఖర్చైనా చిన్నారికి తాను చికిత్స అందిస్తానని తెలిపారు. ఇదే విధంగా పలువురి కష్టాలను తెలుసుకున్న సీఎం జగన్ వారందరికీ సహాయం చేసేందుకు ముందుకొచ్చి తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు.













