Chandrababu: రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు : చంద్రబాబు
ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతి (Amaravati)ని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) అన్నారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. వందేళ్ల తర్వాత కూడా టెక్నాలజీ (Technology) లో ఎవరూ అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నా మని చెప్పారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పోషిస్తోందన్నారు. టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్ మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తెస్తాయని వెల్లడిరచారు. సాంకేతికత జీవితంలో ఒక భాగంగా మారుతుందని చెప్పారు. డ్రోన్ల సాయంతో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ (Patrolling) చేస్తున్నారన్నారు. ఏఐ(AI), నాలెడ్జితో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని వెల్లడిరచారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఏవిధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.













