Amaravati: అమరావతిలో రూ.212 కోట్లతో రాజ్‌భవన్ నిర్మాణం

రాజధాని అమరావతి (Amaravati)లో గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌ను రూ.212 కోట్లతో నిర్మించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీయే) ఆమోదం తెలిపింది. కృష్ణానది (Krishna River) ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్‌భవన్ నిర్మించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన 53వ సీఆర్డీయే (CRDA) సమావేశం సచివాలయంలో జరిగింది. ఇందులో 18 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని పనులు మళ్లీ ప్రారంభించామని, భూములు త్యాగం చేసిన రైతులకు రాజధాని అభివృద్ధి ఫలాలు తొలుత దక్కాలని పేర్కొన్నారు. రాజధాని రైతులకు కౌలు చెల్లింపులోనూ జాప్యం జరగకూడదు. ఈ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇస్తామని చెప్పామో, అక్కడే ఇవ్వాలి. ఏ ఊళ్లో భూములు ఇచ్చినవారికి అదే ఊళ్లో ప్లాట్లు ఇస్తామంటూ ఇచ్చిన హామీని అమలుచేయాలి అని అధికారులను ఆదేశించారు.