Drone City: డ్రోన్ సిటీకి ప్రధాని మోదీ శంకుస్థాపన : చంద్రబాబు

కర్నూలులో ప్రతిపాదించిన డ్రోన్ సిటీ (Drone City)కి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శంకుస్థాపన చేస్తారని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేయాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని ఈ నెల 16న శ్రీశైలం(Srisailam) రానున్నారని, అదేరోజు ఆయన శంకుస్థాపనలో పాల్గొంటారని పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, డిసెంబరులో డ్రోన్ షో నిర్వహించాలని సూచించారు.