Chandrababu :ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా : సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) ఖండిరచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత యువతి, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. గుర్రంకొండ (Gurramkonda) మండలం ప్యారంపల్లెలో గణేశ్ (Ganesh) అనే యువకుడు ఓ యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు (Ammacheru) మిట్టకు చెందినవాడిగా గుర్తించారు.













