రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు : చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే రాష్ట్రాలు, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూట్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో జాతీయ మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని అన్నారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏం జరుగుతుందో వివరించడానికీ మీ ముందుకొచ్చాను. రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి తిరోగమనంలో ఉన్న పరిస్థితులో మేం అధికారంలోకి వచ్చాం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏపీలో ఒక్కసారిగా 19 ఐటీ బృందాలును దాడులకు పురిగొల్పారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని కేంద్రం చెప్పింది. అలాంటిదేమీ జరగలేదు. ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో నగదు జమచేస్తామన్నారు.
డిజిటల్ ఎకానమీ ద్వారా అవినీతి తగ్గుతుందని నేను చెప్పాను. డిజిటల్ ఎకానమీ వల్ల ఫిజికల్ కరెన్సీ డిమాండ్ తక్కువగా ఉంటుంది. పెద్ద నోట్లు రద్దుచేస్తామని రూ.2 వేల నోట్లు తీసుకొచ్చారు. కానీ, నోట్ల రద్దుతో దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. నోట్ల రద్దు ఆలోచన సరైంది కాదు. సరైన ప్రణాళిక లెకుండా అమలు చేశారు. దేశంలో బ్యాంకులన్నీ స్థైర్యం కోల్పోయాయి. రూ.వేల కోట్లతో నీరవ్ మీద, జతిన్ మెహతా, నితిన్ సందేశ్రా దేశం విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత జీఎస్టీని తీసుకొచ్చారు. 2006తో పోలిస్తే ఆర్థిక వృద్ధి రేటు ఆశించినంతగా లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఎప్పుడు చేస్తారు? రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం చెప్పింది. ఎప్పుడు పూర్తి చేస్తారు? వ్యవసాయంలో 3 శాతం వృద్ధి మాత్రమే ఉంది అని చంద్రబాబు అన్నారు.













