నేను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా నన్ను ఆదరించారు : సీఎం చంద్రబాబు
మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన స్థానిక బస్లాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. నేను ఇక్కడకు వచ్చినా, రానున్నా నన్ను ఆదరించారు. ఇప్పటి వరకు నన్ను 8 సార్లు గెలిపించారు. కుప్పం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. కుప్పం వ్యవహారాలు చూస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మండల పార్టీ నేతలకు అభినందనలు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిరచారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం. అహంకారంతో విర్రవీగితే ప్రజాస్వామ్యంలో వైసీపీకి పట్టిన గతే పడుతుందని ప్రజలు నిరూపించారు. నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నా. చిత్తూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు.
వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటాం. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేబినెట్లో 8 మంది బీసీలకు అవకాశం కల్పించాం. వైసీపీ పాలన పీడకల అలాంటిది ఎప్పుడూ చూడలేదు. వైసీపీ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలు అసహ్యించుకున్నారు. ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు. కుప్పం ప్రశాంతమైన స్థలం. ఇక్కడ హింసకు చోటు లేదు. కుప్పంలో రౌడీయిజం చేసేవారికి అదే కపడటి రోజు జాగ్రత్త అని హెచ్చరించారు.













