2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడమే లక్ష్యం : సీఎం చంద్రబాబు
కడప ఉక్కు కర్మాగారం (Kadapa Steel Plant) నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2028 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఇనుప ఖనిజం నిల్వలు ఆపారంగా ఉన్నాయని, మరో అరడజను ఉక్కు పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పుట్టపర్తి (Puttaparthi) కేంద్రంగా రూ.15 వేల కోట్ల పెట్టుబడితో యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాబోతోందన్నారు. ఇక్కడ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడం ద్వారా ఏరో స్పేస్ హబ్ గా మారి, భవిష్యత్తులో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు డ్రోన్ సిటీ (Drone City)కి ఈ నెల 15న శంకుస్థాపన చేయబోతున్నామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి








