జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకం : చంద్రబాబు
జీవితంలో అన్నింటి కంటే విద్యార్థి దశ కీలకం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ ఆంధ్రావర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పలు కంపెనీలతో రూ.16 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకున్నామని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. విద్యార్థి దశలోనే లక్ష్యాలు నిర్దేశించుకుని సాధించాలన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే కావాలని సంకల్పించుకున్నా. బిల్‌గేట్స్‌కు నా విజన్ వివరించి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌కు వచ్చేలా కృషి చేశారు. మీరు మీ లక్ష్యాలను చేరుకోడానికి అవకాశాలు అందిపుచ్చుకోండి. ఫలితాలు వచ్చే వరకు కష్టపడాలి. అప్పుడే నాయకత్వం సాఫల్యం అవుతుంది అని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇంజీనిరింగ్, వైద్య కళాశాలలు గణనీయంగా పెంచామని తెలిపారు. ఐటీ అస్సలు లేని స్థాయి నుంచి 17 శాతానికి తీసుకురాగలిగామన్నారు. యువత ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదుగాలని ఆకాంక్షించారు.













