Chandrababu: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, ఫీకల్ స్టైడ్జ్ శుద్ధి ప్లాంట్లు, గోబర్ దన్ ప్లాంట్లు, గ్రే వాటర్ నిర్వహణ నిర్మాణాలు వంటి రూ.68.25 కోట్లతో చేపట్టిన పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు.






