తిరుమల శ్రీవారిని దర్శించుకున్న.. జిస్టిస్ ఎన్వీ రమణ
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ కుటుంబం శ్రీవారిని దర్శించుకుంది. జస్టీస్ ఎన్వీ రమణ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు.













