ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో శ్రీవారి బ్రేక్ దర్శనాల నిలిపివేత..
తిరుమల దర్శనాలలో రెగ్యులర్ గా జరిగే దర్శనాలు కాక సిపార్సు లేఖల ద్వారా జరిగే దర్శనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని బ్రేక్ దర్శనం అని కూడా పిలుస్తారు. ఈ దర్శనం కావాలి అనుకున్న వారు తాము తెచ్చుకున్న సిఫార్స్ లెటర్ తీసుకుని వెళ్లినవారికి బ్రేక్ దర్శనం వసతి కల్పిస్తారు. లెటర్ తీసుకున్న వచ్చిన వారు ముందుగా JEO ఆఫీస్ లో ఉదయం 11 గంటల లోపు లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. లెటర్ పరిశీలించిన తర్వాత వాళ్లకు సాయంత్రం 4 గంటల తరువాత మెసేజ్ పంపిస్తారు. ఆ తర్వాత దర్శనానికి టికెట్ కి అమౌంట్ కట్టి బుక్ చేసుకున్నాక బ్రేక్ దర్శనం లో పంపిస్తారు. చాలామంది భక్తులకు స్వామిని చాలా దగ్గరగా చూసే అవకాశం కల్పించే ఈ దర్శనం ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక వర్తిస్తుందా లేదా అన్న అనుమానం అందరికి ఉంటుంది. అయితే ఈ విషయంలో టీటీడీ శాసన మండలి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి సిఫార్సు లేఖలతో జరిగే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు మార్చ్ 11, సోమవారం నాడు నిర్ణయం తీసుకుంది. అంటే ఇక శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖల స్వీకరణ నిలిపి వేస్తారు.













