ఎన్నికల వ్యూహానికి సర్వం సిద్ధం.. ఎంపీ ,ఎమ్మెల్యేలతో చంద్రన్న వర్క్ షాప్..
జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి అనే పట్టుదలతో కృషి చేస్తున్న టీడీపి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంసిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.. మరోపక్క ఈరోజు ఎంపీ ,ఎమ్మెల్యే అభ్యర్థులు ..నియోజకవర్గ ఇన్చార్జి లతో చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు కీలక సూచనలు ఇవ్వడంతో పాటు ప్రచారం ఎలా ముందుకు కొనసాగించాలి అనే విషయాలపై సలహాలు కూడా ఇవ్వబోతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ వర్క్ షాప్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. ఈ వర్క్ షాప్ కి పోటీ చేసే అభ్యర్థులతో పాటు వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మేనేజర్లు కూడా హాజరు కాబోతున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, అధికార పార్టీ కుట్రలు, ప్రజలలో ఎలా తమ పథకాలను ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయాలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. దీనిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. పూర్తి వివరాలు మీటింగ్ పూర్తి అయిన తర్వాత తెలుస్తాయి.













