9 అంశాలపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా సంక్షేమానికి సంబంధించిన తొమ్మిది అంశాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులు, భూ సమస్యలపై చర్చించారు. చంద్రన్న బీమా, పెళ్లికానుక, యువ నేస్తం, గృహ నిర్మాణం, అన్న క్యాంటీన్లు, ఆదరణ పథకాలపై చర్చలు జరిపారు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే బడ్జెట్ రూపకల్పన, గవర్నర్ ప్రసంగంపై చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతారు. అనంతరం పోలవరం పనులను వర్చువల్ ఇన్స్పెక్షన్ చేయనున్నారు.
జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్. జన్మభూమిలో వచ్చిన సమస్యల్ని పరిష్కారం చేయాలి. చేయలేనివాటిని ఎందుకు చేయలేదో ప్రజలకు తెలియజేయాలి. ప్రకృతి సేద్యం ప్రపంచానికి భారతదేశం తరఫున మనం అందించే కానుక.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు:
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ ముఖ్య ఉద్దేశం వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికే. దావోస్లో ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రకృతి సేద్యంపై చర్చ జరిగింది. ప్రకృతి సేద్యం ప్రపంచానికి భారతదేశం తరఫున మనం అందించే కానుక. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం. సాంకేతికతను ప్రకృతికి అనుసంధానం చేస్తున్నాం.
ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలి.













