త్వరలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో తర్వలోనే పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వరద ప్రాంతాల్లోని పరిస్థితులపై పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధితులకు ఆహారం, మందులు, చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. టీడీపీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయన్నారు.













