Chandrababu:ఐటీకి సరికొత్త గమ్యస్థానం విశాఖ : చంద్రబాబు
మహిళలకు సురక్షితమై నగరంగా విశాఖ ఖ్యాతి గడిరచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఐటీకి సరికొత్త గమ్యస్థానం విశాఖ (, Visakhapatnam) అని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో అనేక అవకాశాలున్నాయని వివరించారు. ఈ రంగంలో ఏపీ 50 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగి ఉందన్నారు. వ్యవసాయం నుంచి 35 శాతం జీఎస్డీపీ వచ్చే రాష్ట్రం ఏపీ మాత్రమే అని అన్నారు. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. దేశంలోని పండ్ల ఉత్పత్తుల్లో 25 శాతం ఏపీ నుంచే ఉన్నాయి. రాష్ట్రంలో 2.26 లక్షల హెక్టార్లలో అక్వాకల్చర్ కొనసాగుతోంది. రైస్‌బౌల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధి గాంచింది. ఆక్వా, కోడిగుడ్ల ఉత్పత్లిలో ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 9 ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease of Doing) బిజినెస్‌లో ప్రథమ స్థానంలో ఉన్నాం. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే 85 శాతం రిజర్వాయర్లు నిండాయి. ఏపీలో కోల్డ్ స్టోరేజీల సామర్థ్యం 17 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు చొప్పున 20 పోర్టులు నిర్మిస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం (Assembly Constituency ) లో ఒక ఎంఎస్ఎంఈ పార్కు (, MSME Park) నిర్మిస్తాం అని తెలిపారు.







