తెలంగాణలో ఆ 4 పార్టీలు కుమ్మక్కు : చంద్రబాబు
తెలంగాణలో టీఆర్ఎస్, వైసీపీ, జనసేన, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అలా కాకుంటే అక్కడ జనసేన, వైసీపీలు ఎందుకు పోటీ చేయడంలేదో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో పవన్, జగన్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లా మారాల రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లు పోరాడిన కాంగ్రెస్తో ఇప్పుడు ప్రజా శ్రేయస్సు కోసం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దేశం కోసం బీజేపీ ప్రభుత్వంపై తిరగబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీని కోసం జాతీయ స్థాయిలో అందర్ని కూడగడుతున్నామని చెప్పారు.













