జయహో బీసీ గర్జనలో చంద్రబాబు వరాల జల్లు
పలు కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు
కార్ల కొనుగోలుపై 25 శాతం సబ్సిడీ
నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
బీసీలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. తూర్పుకాపులు, అగ్నికుల క్షత్రియులు, వర్నికుల క్షత్రియులు, శెట్టి బలిజ, యాదవులు, మత్స్యకారులు, ఈడిగ, యాత, శ్రీశయన, గౌడలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేతల కోసం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్లు, స్వరకారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ సభలో చంద్రబాబు ఈ మేరకు వరాలను ప్రకటించారు.
అత్యంత వెనుకబడిన బీసీలకు ఇచ్చే సబ్సిడీని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కార్ల కొనుగోలుపై బీసీలకు 25 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పారు. వడ్డెరలను ఎస్సీలలో చేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల సమయంలో రానున్న 75 రోజులు బీసీల ఇంటిపై టీడీపీ జెండా ఎగరాలని చెప్పారు. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 150కి పైగా అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలను గెలుస్తామని చెప్పారు.
వడ్డెరులను కూడా ఎస్సీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం: సీఎం చంద్రబాబు
యాదవ, తూర్పుకాపులు, మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్, అగ్నికుల క్షత్రియులు, వర్నికుల క్షత్రియులు, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, గౌడకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం – అంతేకాదు చేనేతల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తాం – నాయిబ్రాహ్మణులకు 150 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇస్తాం – వాల్మికి, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం – బీసీలకు సబ్‌ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పిస్తాం – అత్యంత వెనుకబడిన బీసీలకు ఇచ్చే సబ్సిడీని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతాం – బీసీలకు కార్ల కొనుగోలుపై 25 శాతం సబ్సిడీ ఇస్తాం – భగీరథ జయంతిని రాష్ట్ర పండుగగా చేస్తాం – బుడబుక్కల, దొమ్మర సంక్షేమానికి కమిటీ వేస్తాం – స్వర్ణకారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తాం – వడ్డెరులను కూడా ఎస్సీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం – 75 రోజులు టీడీపీ జెండా బీసీల ఇంటిపై ఎగరాలి – వచ్చే ఎన్నికల్లో 150 సీట్లకుపైగా గెలుస్తాం- 25 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం: సీఎం చంద్రబాబు.
తమ్ముళ్లూ.. రాజశేఖర్ రెడ్డి మీకు చేసిందేముంది?: చంద్రబాబు
బీసీలకు న్యాయం చేసింది టీడీపీ మాత్రమే
మిగులు బడ్జెట్ ఉన్నా వైయస్ కేవలం 3వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
టీడీపీ అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుంది
బీసీలకు న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ అంటే బీసీ… బీసీ అంటే టీడీపీ అని చెప్పారు. రాజమండ్రిలో నిర్వహించిన జయహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది దివంగత ఎన్టీఆర్ అని తెలిపారు. బీసీలకు రాజశేఖర్ రెడ్డి ఏమి చేశారు తమ్ముళ్లూ? అంటూ ప్రశ్నించారు. బీసీలను వైయస్ అణగదొక్కారని ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్నా బీసీలకు కేవలం రూ. 3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని దుయ్యబట్టారు. బీసీలకు ఆధునిక పనిముట్టు ఒకటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.
తెలంగాణలో బీసీలను ఓసీలుగా మార్చారని… దానికి వైసీపీ అధినేత జగన్ మద్దతు పలికారని చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలనుకుంటున్న జగన్… ముందు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ గా సుధాకర్ యాదవ్ ను నియమిస్తే… వ్యతిరేకించారని, ఆయనపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.













