బీసీలు అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు: సీఎం చంద్రబాబు
టీడీపీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది – బీసీలకు గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ -ఎన్టీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు పెట్టారు – బీసీలు అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీలు – అన్ని వ్యవస్థల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం- వైఎస్ హయాంలో బీసీలకు ఏమీ చేయలేదు – వైఎస్ వెనుకబడిన వర్గాలను అణగదొక్కారు – రూ. 950 కోట్లతో 4 లక్షల మందికి పనిముట్లు ఇచ్చాం – టీటీడీ చైర్మన్‌గా సుధాకర్‌యాదవ్‌ని నియమించాం – కాంగ్రెస్ హయాంలో ఒక్క బీసీ అయినా ఉన్నాడా ? – బీసీల కోసం పోరాడిన ఏకైక ప్రభుత్వం టీడీపీనే- నేతన్నలకు రూ. 111 కోట్లు రుణమాఫీ చేశాం – వెనుకబడిన వర్గాలకు విదేశీ విద్యకు రూ. 15 లక్షలు ఇస్తున్నాం – ఎంబీసీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం – చేనేత కార్మికులకు ఇచ్చే 100 యూనిట్ల ఉచిత కరెంట్‌ను 150 యూనిట్లకు పెంచుతాం -బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా వైఎస్ అన్యాయం చేశారు – 11 బీసీ ఫెడరేషన్లను నిర్వీర్యం చేశారు – బీసీ మంత్రులను జైలుపాలు చేశారు- బీసీ రిజర్వేషన్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది – దానికి జగన్ మద్దతు పలికారు – బీసీలకు అన్యాయం చేసినవారితో జగన్ జతకట్టారు – బీసీలను దెబ్బతీసేందుకు వైసీపీ, బీజేపీ కుట్ర పన్నారు – బీసీలు మా వెనుక ఉన్నారని బీజేపీ, వైసీపీ గుర్తుపెట్టుకోవాలి – తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 34 శాతం బీసీలకు కేటాయింపును ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం నిలిపివేసింది – ఫెడరల్ ఫ్రంట్‌ని ముందుకు తీసుకెళ్లాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వివరణ ఇవ్వాలి – ప్రతి గ్రామంలో జయహో బీసీ గర్జన ఉధృతం చేయాలి – ప్రతిపక్షం గుండెల్లో రైళ్లు పరుగెత్తించే బాధ్యత పార్టీ శ్రేణులదే : సీఎం చంద్రబాబు నాయుడు.













