Chandrababu serious on ministers: నాతో సమానంగా మీరు కూడా పని చేయాలి.. మంత్రులకు చంద్రబాబు క్లాస్..
చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ (AP cabinet meeting ) భేటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. అనంతరం క్యాబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత మంత్రులకు చంద్రబాబు పెద్ద క్లాస్ పీకినట్లు టాక్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రులు స్పీడ్ పెంచాలని చంద్రబాబు సూచించారట. పని విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని.. మంత్రులు తమ స్పీడ్ పెంచాలని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు 5 నెలల కాలం కావస్తోంది.. ఈ నేపథ్యంలో తనతో పాటు మంత్రులు కూడా సమర్థవంతంగా పని చేయాలని చంద్రబాబు అన్నారని తెలుస్తోంది. ఇప్పటికీ కూడా ఎంతోమంది మంత్రులు (AP ministers) పనుల విషయంలో నిర్మితంగా వ్యవహరిస్తున్నారని.. ఇలా ఉంటే పని చేయడం చాలా కష్టం అవుతుంది అని చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారట.
మంత్రుల క్రియాశీలకంగా వ్యవహరించి.. ఎంతో యాక్టివ్ గా ప్రజలలోకి దూసుకు వెళితేనే వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ పవర్ ఫుల్ గా ఉంటుంది అని చంద్రబాబు హితవు పలికారు. ప్రస్తుతం ఉన్న కొందరు మంత్రుల పనితీరు పై తనకు ఉన్న అసంతృప్తిని కూడా వ్యక్తీకరించారు. అలాగే మంత్రులు తమ తమ జిల్లాలలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి అంటూ దిశా నిర్దేశం చేశారట.
ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న మంచి కార్యక్రమాలు.. వాటి వల్ల కలుగుతున్న లబ్ది ప్రజల మధ్యకు తీసుకువెళ్లడంలో విఫలమైతే కష్టమని.. మంత్రులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పని చేయాలని అన్నారు. ఇక రీసెంట్గా జరిగిన డ్రోన్ షో( Drone show) అద్భుతంగా పూర్తయిందని.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of world records) లో చోటు దక్కడం ఎంతో ఆనందదాయకంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నరట. అనర్హులు అంటూ ఎంతోమంది పింఛన్ లబ్ధిదారులను గత ప్రభుత్వం లిస్టు నుంచి తొలగించింది.. దీనిపై గ్రామ సభలలో అవసరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.













