ఇలాంటివి పార్టీకి కొత్తకాదు : చంద్రబాబు
పార్టీకి ఇలాంటి సంక్షోభాలు కొత్త కాదని, కార్యకర్తలెవరూ అధైర్యపడాల్సిన అసవరం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీ బీజేపీలో చేరిన నేపథ్యంలో పార్టీ సీనియర్ నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో టీడీపీ పోరాడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇదిలావుంటే టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సుజనాన చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడును కలిసి పార్టీని వీడుతున్నట్టు లేఖ ఇచ్చిన విషయం తెలిసిందే. తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని కోరారు.













