ఈ విషయాలను మేధావులు తెలుసుకోవాలి
పోలవరం లాంటి ప్రాజెక్ట్ కట్టడమంటే కాంట్రాక్టర్లను బెదిరిండచం, బెట్టింగ్ కాసినంత సులభం అన్నట్టుగా కొందరు మేధావులు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. కాఫర్‌డ్యాం కట్టడం వల్లే గ్రామాలు మునిగాయంటూ కొత్తగా ఇరిగేషన్ పాఠాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర పర్యవేక్షణ, పోలవరం అథారిటీ, సీడబ్ల్యూ నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రతి విషయంలో టెక్నికల్ కమిటీలు ఉంటాయని, ఇంజనీర్లు అనుభవజ్ఞులు ఎంతో ఆలోచించి డిజైన్లను అందిస్తారని గుర్తు చేశారు. ఈ విషయాలను సదరు మేధావులు తెలుసుకోవాలని చంద్రబాబు సూచంచారు.













