సిలికాన్ సిటీగా తిరుపతి : చంద్రబాబు
చిత్తూరులో సిలికాన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో టీసీఎల్ కంపెనీకి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2019 డిసెంబర్ నాటికి టీసీఎల్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో చిత్తూరుకు అనేక కంపెనీలు తరలివస్తాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఏపీ పెట్టుబడులకు అనుకూల ప్రదేశంగా మారిందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్‌లో ఉందన్నారు. దేశానికి తిరుపతి ఆదర్శంగా నిలుస్తోందని, తిరుపతి ఎక్ట్రానిక్స్ హబ్‌గా మారనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, అమర్నాథ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ గీర్వాణీ, ఎంపీ జయదేవ్, టీసీఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు.













