రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు భేటీ!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు ఢిల్లీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయి. హస్తిన వేదికగా విపక్ష నేతలను చంద్రబాబు కలవబోతున్నారు. ఉదయం శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో చంద్రబాబు సమావేశం అవుతారు. మధ్యాహ్నం వామపక్ష నేతలతో, సాయంత్రం అఖిలేష్ యాదవ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు. సేవ్ నేషన్ పేరుతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీకి అన్యాయం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవారితో కలిసి వెళ్లేందుకు ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తోంది.













