ఇతర రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే అత్యధికం : చంద్రబాబు
అధికారంలోకి వస్తే పెట్రో ధరలు తగ్గిస్తానని ముఖ్యమంత్రి జగన్ గతంలో చెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ దేశంలో అనేక రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని అన్నారు. ఏపీ ఆ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే అత్యధికంగా ధరలు ఉన్నాయని తెలిపారు. పెట్రో ధరలు ఎందుకు తగ్గించట్లేదని ప్రశ్నించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రో ధరలపై ఆందోళన చేశారని తెలిపారు. ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. అధికారం చేతుల్లో ఉందని ధరలతో ప్రజలను బాదుతారా? అని ప్రశ్నించారు. పెట్రో ధరలు తగ్గించేవరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు.
ఈ నెల 9న మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్రంలో పెట్రో ధరలు కనీసం రూ.16 వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు. టోల్గేట్ వద్ద పట్టుబడిన గంజాయిపై డీజీపీ సమాధానమేంటి? గంజాయి మొత్తం మార్కెట్లోకి వస్తే పరిస్థితేంటి? అన్నారు. రెండున్నరేళ్లలో జగన్ చేసింది విధ్వంసం, పన్నుల బాదుడు. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, కేసులతో వేధిస్తున్నారు. అధికారం ఉందంటే కుదరదు ప్రజలు తిరగబడితే పారిపోతారు అని అన్నారు. ద్రవిడ వర్సిటీ రిజిస్ట్రార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? నిబంధనలు అతిక్రమించిన అధికారులను వదిలిపెట్టం అని హెచ్చరించారు.













